ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు
రాజస్థాన్ లో సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తోంది. ఈక్రమంలో తలొగ్గనివారిపై సస్పెన్షన్‌కు కూడా వెనుకాడటం లేదు. తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు వేసింది. భన్వర్‌లాల్ శర్మ, విశ్వేంద్రసింగ్ ప్రాథమిక సభ్యత్వాలను కాంగ్రెస్ రద్దు చేసింది. వారిద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
శాసనసభ్యుడిగా తనతో సహా 19మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్ సీపీ జోషి ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ సచిన్ పైలట్ దాఖలు చేసిన వ్యాజ్యంపై రాజస్థాన్ హైకోర్టు విచారణ జరపనున్న వేళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది.
రాజస్థాన్ ప్రభుత్వాన్ని కోర్టు వరకు తీసుకెళ్లినా సచిన్ పైలట్ ని కాంగ్రెస్ అధిష్టానం పూర్తిగా టార్గెట్ చేయడం లేదు. ఆయనపై మాటల యుద్ధానికి దిగడం లేదు. సచిన్ పైలట్ ని పల్లెట్టు మాట కూడా అనకూడదని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారమ్. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్‌కు కాంగ్రెస్ అధిష్టానం ఇంకా తలుపులు తెరిచే ఉంచినట్టు సమాచారమ్.