ఛార్మి ఇంట్లో విషాదం
నటి, నిర్మాత ఛార్మి ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె అత్త కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఛార్మి ఎమోషనల్ ట్విట్ చేశారు.
‘ఇక మీరు లేరు అనే మాటే వినలేకపోతున్నా. కానీ జీవితంలో జరిగేది జరగక మానదు. నిన్ననే మనం చివరగా వీడియో కాల్లో మాట్లాడుకున్నాం. కానీ అదే చివరిది అవుతుందని భావించ లేదు. మీరు లేరని తెలిసి మాటలు రావడం లేదు. పైన స్వర్గంలో కూడా నీకు నచ్చినట్టుగా వైన్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటావని అనుకుంటున్నా.పైన ఉన్న అప్పితో కలిసి ఎంతో అమూల్యమైన సమయాన్ని గడుపుతావని ఆశిస్తున్నా. నిన్ను, నీ చిరునవ్వును మిస్ అవుతున్నా. నా ప్రియమైన ఆంటీ నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని ఛార్మి ట్విట్ చేశారు.
హీరోయిన్ గా సినిమాలు చేయడం మానేసిన ఛార్మి.. దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. గత యేడాది ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఛార్మీ-పూరి.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ సినిమాని నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోన్న ఫైటర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
— Charmme Kaur (@Charmmeofficial) July 16, 2020