తెలంగాణ వైద్యులకి 10శాతం బోనస్

కరోనా వారియర్స్ కి సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. కరోనా కట్టడిపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు వైద్యఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరికీ పదిశాతం అదనపు వేతనం కొనసాగించారు. పోలీసుశాఖ సిబ్బంది, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుధ్య సిబ్బందికీ ఇన్సెంటివ్ కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు.

అంతేకాదు..  వైద్య కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు యుజిసి స్కేల్ అమలు, కొత్తగా నియామకమైన నర్సులకు పాత వారితో సమానంగా వేతనాలు, ఆయుష్ విభాగాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, మెరుగైన వైద్యం అందించే విషయంలో ఆరోగ్య శాఖ మంత్రి, సిఎస్ తక్షణ నిర్ణయాలు తీసుకుని అమలుచేయడానికి వీలుగా జనరల్ బడ్జెట్ కు అదనంగా రూ.100 కోట్లు కేటాయించారు.