20 రోజుల పాటు తిరుమల శ్రీవారి దర్శనం బంద్ ?

కరోనా మహమ్మారి దేవుళ్లని కూడా వదలడం లేదు. కరోనా లాక్‌డౌన్ తో దేశంలోని దేవాలయాలన్నీ రెండ్నెళ్ల పాటు మూతపడిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా తిరిగి తెరచుకున్నాయ్. కానీ ఎప్పటికప్పుడు భయం భయంగా దర్శనాలు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక తిరుమలలో పలువురు సిబ్బంది, అర్చకులు కరోనా బారినపడుతున్నారు.

శ్రీవారికి కైంకర్యాలు నిర్వహించే అర్చకులకి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. తిరుమల శ్రీవారి ఆలయంలో 50 మంది అర్చకులు పని చేస్తున్నారు. వీరిలో 15 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో 20రోజుల పాటు తిరుమల శ్రీవారి దర్శనాలని బంద్ చేయాలని ఆలయ అధికారులు కోరుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. 20 రోజుల పాటు తిరుమల శ్రీవారి దర్శనం బంద్ కానుందని తెలుస్తోంది.