బ్రేకింగ్ : ఏపీ రాజధాని తరలింపు ప్రక్రియ ప్రారంభం

ఏపీ రాజధాని వికేంద్రీకరణ ప్రక్రియ ప్రారంభం అయినట్టేనని వైసీపీ నేతలు చెబుతున్నారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులకి శాసనమండలిలో బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ నెల 17తో మండలి ఆమోదానికి గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రెండు బిల్లులని గవర్నర్ ముందుకు తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. గవర్నర్ ఆమోదం వేస్తే వెంటనే రాజధాని వికేంద్రీకరణ ప్రారంభం అయినట్టేనని చెబుతున్నారు.

ఈ రెండు బిల్లులకి గవర్నర్ తన విచక్షణ అధికారాలతో ఆమోదం తెలిపబోతున్నారు. రెండ్రోజుల్లో ఈ బిల్లులకి ఆమోదం పడనుందని చెబుతున్నారు. మరోవైపు ఈ రెండు బిల్లులపై గవర్నర్ న్యాయపరమైన సలహాలు కూడా తీసుకోవచ్చని తెలుస్తోంది. అయితే కేంద్రంతో వైసీపీ ప్రభుత్వానికి సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో ఈ రెండు బిల్లులకి గవర్నర్ ఆమోదం లాంఛనమేనై చెబుతున్నారు. అదే జరిగితే.. ఒకట్రెండు రోజుల్లోనే ఏపీ రాజధాని తరలింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుందని చెప్పవచ్చు.