‘మా ఇంటికి రాకండి.. మీ ఇంటికి రానివ్వకండీ’

ఇది కరోనా టైం. మొహమాటమే లేదు. ‘మా ఇంటికి రాకండి. మీ ఇంటికి రానివ్వకండీ’ అని హైదరాబాద్ లోని ఓ కాలనీ వాసులు ఇళ్లకి బోర్డులు పెట్టుకున్నారు. తెలంగాణలో కరోనా విజృభిస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ అత్యధిక కేసులు జీహెచ్ ఎంసీలో నమోదవుతున్నాయ్. కరోనా వైరస్ సోకినా.. ఆ లక్షణాలు బయటికి కనిపించని వారు హాయిగా రోడ్లపై తిరుగుతున్నారు.

ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే హోం ఐసోలేషన్ లో ఉండాల్సిన 2,200 మంది ప్రభుత్వ అధికారులకు సహకరించకుండా మిస్సింగ్ లిస్టులో ఉంటున్నారని ఓ సర్వే రిపోర్ట్. ఈ నేపథ్యంలో ముషీరాబాద్ బోలక్ పూర్ డివిజన్ లోని పద్మశాలీ కాలనీ వాసులు అలర్ట్ అయ్యారు. తమని, తమ కుటుంబ సభ్యులను రక్షించుకునేందుకు వినూత్న పద్దతిలో కాలనీకి బోర్డును ఏర్పాటు చేసుకున్నారు. ఆ కాలనీలో ఏ ఇంటిముందు చూసినా..  ‘మా ఇంటికి రాకండి. మీ ఇంటికి రానివ్వకండీ’ అనే బోర్డులు కనిపిస్తున్నాయి.