గుడ్ న్యూస్ : కరోనా టీకా రెడీ
కరోనా మహమ్మారికి టీకాని కనిపెట్టే పనిలో ప్రపంచ దేశాలు నిమగ్నమయ్యాయ్. ఎవరు ముందుగా సెక్సస్ అవుతారు. ఏ దేశం ముందుగా కరోనా టీకా రెడీ చేస్తుంది అనే ఆసక్తి నెలకొంది. అయితే అందరి కంటే ముందు రష్యా కరోనా టీకాని అందించేలా ఉంది. రష్యా టీకా వచ్చే నెలలో ప్రజలకు అందుబాటులోకి వస్తునట్టు రష్యా ఆరోగ్యశాఖామంత్రి ప్రకటించారు.
ఇందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఆగష్టు మూడో తేది నుంచి రష్యా, సౌదీ ఆరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఈ టీకా మూడో దశ క్రినికల్ ట్రైల్స్ వేలాదిమందిపై నిర్వహించనున్నారు. సమాంతరంగా టీకాను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. ప్రపంచంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే తొలి కరోనా టీకాగా రష్యా వ్యాక్సిన్ నిలువనుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా మూడుకోట్ల డోస్‌లను ఉత్పత్తి చేయనున్నట్టు రష్యా ప్రకటించింది.