పాడ్‌కాస్ట్‌ ‘మ్యూజింగ్స్’ విన్నారా ?

దర్శకుడు పూరి జగన్నాథ్ మాటలు బుల్లెట్ లా ఉంటాయ్. అవి గుండెల్లోకి దిగిపోయి గెలికేస్తుంటాయ్. సినిమా థియేటర్స్ నుంచి బయటికొచ్చాక కూడా మనవెంట వస్తాయ్. నడిపిస్తాయ్. జీవితంలో భాగమైపోతాయ్. అలాంటి మాటలని ఇప్పుడు పూరి పాడ్‌కాస్ట్ రూపంలో తీసుకొచ్చారు.

‘హాయ్‌ నేను పూరి జగన్నాథ్‌.. ఇది నా పాడ్‌కాస్ట్‌ ‘మ్యూజింగ్స్‌” అంటూ పాడ్‌కాస్ట్‌ను మొదలుపెట్టారు పూరి. ‘ఇండియన్స్‌ అందరం ముసలోళ్లలా తయారయ్యాం’ అంటూ ‘అమెరికా’లో మన వ్యవహార శైలిపై చెంపచెల్లుమనిపించాడు. జీవితం గురించి, జీవితంలో బాగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశాల గురించి ఆ పాడ్‌కాస్ట్‌లో తన మాటల్లోనే వినిపించాడు. మొత్తంగా 46 విభిన్న అంశాల గురించి ఆ పాడ్‌కాస్ట్‌లో పూరి అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని మీరు వినేయండీ..!

https://spoti.fi/39bs5hb

https://apple.co/2CSuxwI