ప్రభాస్ సినిమాకు థమన్ సంగీతం ?

బాహుబలి ప్రభాస్ ‘రాధేశ్యామ్’తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి రాథాకృష్ణ దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. రొటీన్ లుక్. కాపీ లుక్ అనే కామెంట్స్ వినిపించాయ్. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు ? అన్నది ఇప్పటికీ క్లారిటీ లేదు. మొదట అమిత్ త్రివేది అనుకున్నారు.

ఆ తర్వాత ఏఆర్ రెహమాన్ పేరు వినిపించింది. కానీ రెహమాన్ ఇప్పటి వరకు రంగంలోకి దగలేదని.. పెద్దగా ఆసక్తిగా చూపడం లేదని టాక్. ఈ నేపథ్యంలో రాధేశ్యామ్ థమన్ చేతికి వచ్చిందని చెప్పుకొంటున్నారు. ఈ ప్రచారంలో నిజమెంత ? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇటీవల కాలంలో థమన్ అదరగొడుతున్నారు. అద్భుమైన పాటలు అందిస్తున్నారు. ఇక నేపథ్య సంగీతంలో థమన్ మాయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.