ఆ హీరోయిన్ ‘పవన్’కు నాల్గో భార్య’ కావాలనుకొందట !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’కు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొన్నాడు. ఆయనంటే గిట్టనివారు ఎత్తిచూపే ఏకైక నెగటివ్ పాయింట్ కూడా ఇదే. ఐతే, ఓ హీరోయిన్ పవన్ కు నాల్గో భార్య కావాలని ఆశపడిందట. ఈ సీక్రెట్ ని పవన్’పై వార్ ప్రకటించిన ప్రముఖ సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి బయటపెట్టారు. పవన్ ని విమర్శిస్తున్న క్రమంలో తనకు ఎవరు అడ్డుపడిన మహేష్ వారినీ వదలడం లేదు. ఇటీవలే పవన్ సపోర్ట్ చేసిన కోన వెంకట్ కు గట్టి సమాధానం ఇచ్చాడు మహేష్. ఇప్పుడు పవన్ సపోర్ట్ చేస్తున్న హీరోయిన్ పూనమ్ కౌర్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
‘ఇతరులను విమర్శించడం ద్వారా డబ్బులు సంపాదించాలనుకునే వారి కంటే.. అడుక్కునే వారు ఎంతో ఉత్తములు’ ‘ఆ ఫ్యాట్సోను రోజూ టీవీలో చూసి బోర్ కొడుతోంది. పాపం.. నిరుద్యోగ సమస్య… ఎవరో అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు డబ్బులు డొనేట్ చేయండి. మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి కూడా మనం ఆహారం అందిస్తున్నాం. ఇది చాలా గొప్ప విషయం. అతనికి మంచి పని దొరకాలని కోరుకుంటున్నాను’ అంటూ మహేష్ కత్తిని ఉద్దేశించి వరుస ట్విట్స్ చేసింది పూనమ్ కౌర్.
దీనిపై మహేష్ కత్తి గట్టిగానే రిప్లై ఇచ్చారు. పవన్ కల్యాణ్ చేసిన సాయంతో ఆంధ్రప్రదేశ్ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఆమె ఎంపికైంది. అంతేకాదు.. ఆమె పవన్ కు నాలుగో భార్య అవ్వడానికి రెడీ. ఈ విషయాన్ని ఆమె రెండు మూడు ఇంటర్వ్యూల్లో చెప్పింది. అలాంటి పూనమ్ కౌర్ పవన్ మెప్పుకోసం కామెంట్స్ చేస్తుందని విమర్శించారు.