చిరు, చంద్రబాబు, త్రివిక్రమ్’లని ఒకేసారి రంగంలోకి దింపిన వర్మ !

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ పేరిట సినిమా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. రేపే రిలీజ్. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ని పీక్స్ లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు వర్మ. ఇందులో భాగంగా ఒకేసారి త్రివిక్రమ్, చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవిలని రంగంలోకి దింపారు. సినిమాలో వీరి పాత్రలకి సంబంధించిన ప్రోమోలని రిలీజ్ చేశారు.

ఒక్కో ప్రోమో ఒక్కో సంచలనంగా కనిపిస్తోంది. త్రివిక్రమ్ కి పవన్ క్లాస్ పీకడం, చేయి చేసుకోవడం ఇందులో చూడొచ్చు. ఇక పవన్ పై ఫైర్ అవుతున్న తెదేపా అధినేత చంద్రబాబుకు.. మీరు దొంగతనాలు మానేస్తే మంచిదని ఝులక్ ఇవ్వడం చూడొచ్చు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా తప్పుడుకి ఒకింత క్లాస్ తీసుకున్నారు. మీ ఫ్యాన్స్ నా మీద పడితారేంటి. నువ్ ఓడిపోతే.. మీ అన్న పార్టీ పెట్టాడు. సీట్లు అమ్ముకున్నారు అంటున్నారని చిరు ఆగ్రహం వ్యక్తమ్ చేయడం చూడొచ్చు. మొత్తానికి.. చిరు, చంద్రబాబు, త్రివిక్రమ్ లతో ఒకేసారి ప్రమోషన్స్ చేపట్టి.. పవర్ స్టార్ కు కావాల్సినంత ప్రచారాన్ని తీసుకొచ్చే పనిలో వర్మ ఉన్నారు.