కేటీఆర్’ని విష్ చేసిన పవన్

తెలంగాణ మంత్రి కేటీఆర్ 45వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకి సినీ, రాజకీయ ప్రముఖులు, కార్యర్తలు, ప్రజల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. ఏపీ సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు తదితరులు ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ని విషె చేశారు. వారికి థ్యాంక్స్ చెబుతూ కేటీఆర్ రిప్లై ఇచ్చారు.

తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్  కల్యాణ్ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ని విష్ చేశారు. ‘బ్రదర్ కేటీఆర్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కేటీఆర్ కు మంచి ఆరోగ్యం, జీవితాన్ని ప్రసాదించాలని చిలుకూరి బాలాజీని ప్రార్థిస్తున్నా’నని పవన్ ట్విట్ చేశారు.