పౌరాణికం థీమ్’తో రానా-మిహీకా వివాహ పత్రిక
యంగ్ హీరో రానా దగ్గుబాటి ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రియురాలు మిహీకా బజాజ్ ని పెళ్లాడనున్నారు. ఆగస్టు 8న వీరి వివాహం జరగనుంది. హైదరాబాద్ లోని చైతన్య ఎన్‌క్లేవ్ (మణికొండ) వివాహ వేడుక. మధ్యాహ్నం 2 గంటలకు వివాహ ముహూర్తం కుదిరింది. రానా-మిహీకాల వివాహ పత్రికని పౌరాణికం థీమ్ తో అద్భుతంగా డిజైన్ చేశారు.
కృష్ణుడు, రుక్మిణిలతో పాత చిత్రంలోని సన్నివేశాన్ని తీసుకొని సూపర్‌గా డిజైన్ చేశారు. ఇప్పుడు రానా-మిహీకాల పెళ్లి కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో రానా, మిహికా పెళ్లికి సంబంధించిన వివరాలను ఇరు కుటుంబాల సభ్యులు వెల్లడించారు. వేదిక, సమయం, రిసెప్షన్ లాంటి వివరాలను తెలియపరిచారు. ఆగస్టు 08వ తేదీ (08-08-2020)న మధ్యాహ్నం 2 గంటలకు, చైతన్య ఎన్‌క్లేవ్, ఖాజాగూడ, మణికొండ, హైదరాబాద్‌లో జరుగుతుందని తెలిపారు.
This #MayaBazar video recreated for 'Daggubati marriage invitation is created by fans not official,
Venue details & time are completely wrong. @RanaDaggubati – #MiheekaBajaj #RanaMiheekaWeddingCeremony pic.twitter.com/g1QBpX9OTv— Vamsi Shekar (@UrsVamsiShekar) July 24, 2020