ఈ 4 వారాల్లో కరోనా విశ్వరూపం చూపించనుందా ?

దేశంలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. ప్రతిరోజు నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. అయితే వచ్చే నాలుగు వారాలు మరింత కీలకం. కరోనా కేసులు భారీగా పెరిగే ఛాన్స్ ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాని సూచిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ప్రతిరోజు 50వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి.

ఇక తెలంగాణలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,567 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయ్. మరో 9 మంది కరోనాతో మృతి చెందారు. ఇక రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 50,826కి చేరింది. మరణాల సంఖ్య 447కి పెరిగింది.