నితిన్ పెళ్లి కొడుకు వేడుకకి హాజరైన పవన్, త్రివిక్రమ్ !
హీరో నితిన్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైపోయింది. ఎల్లుండే (జులై 26) నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రియురాలి షాలిని పెళ్లాడబోతున్నారు. హైదరాబాద్ ఫలక్‌నామా ప్యాలస్ వివాహ వేడుక కానుంది.
తాజాగా నితిన్ పెళ్లి కొడుకుని చేశారు. ఈ వేడుకకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత రాథాకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోని నితిన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. వారికి థ్యాంక్స్ చెప్పారు.
వాస్తవానికి ఏప్రిల్ 16నే నితిన్-షాలినీల పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నెల 26న వారిద్దరికీ సరిపోయేలా ముహూర్తం కుదరడంతో వధూవరుల కుటుంబ సభ్యులు ఈ డేట్‌ను ఫిక్స్ చేశారు.
A Big BIGGGG thanku from the bottom of my heart to our POWERSTAR and TRIVIKAM garu and ChinaBabu garu for comin over and blessin me today on my pellikoduku func!! Really means a lot to me 🤗🤗🤗🤗🤗😍😍😍 pic.twitter.com/FnisoavTPH
— nithiin (@actor_nithiin) July 24, 2020