‘పరాన్నజీవి’ టీజర్’పై వర్మ షాకింగ్ రియాక్షన్

‘పవర్ స్టార్’ పేరిట సినిమా తీస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవన్ కల్యాణ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే పని పెట్టుకున్నారు. సినిమా ప్రచార చిత్రాలు చూస్తే ఆ విషయం స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ వర్మపై ప్రతిదాడి ప్రారంభించారు. పరాన్నజీవి పేరిట వర్మపై ఓ సినిమా తీస్తున్నారు. పవర్ స్టార్ రిలీజ్ రోజున, అదే సమయానికి పరాన్నజీవిని వదులుతున్నారు.

శుక్రవారం ఈ సినిమా టీజర్ ని విడుదల చేసారు. ఆర్జీవిగా శకలక శంకర్ కనిపించారు. వర్మ తాగుబోతు, స్రీ లోలుడు, పిచ్చోడు అని టీజర్ తో చెప్పే ప్రయత్నం చేశారు. తాజాగా ఈ టీజర్ పై వర్మ కూడా స్పందించారు. “నేను వోడ్కా తాగుతాను. అమ్మాయిలతో తిరుగుతాను, పోర్న్ చూస్తాను” అని టీజర్ లో ఉంది. అయితే ఆ విషయాలన్నీ నేను బయటి ప్రపంచానికి చెప్పుకొని తిరుగుతున్నవే. నా గురించి అందులో కొత్తగా టీజర్ లో  ఏముంది ? అని ప్రశ్నించాడు.