ఇకపై ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు

ఆర్టీవో ఆఫీసుకు వెఌతే చాలు బోకర్లు  మన జేబులు ఖాళీ చేస్తుంటారు. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలన్న, లైసెన్స్ రిన్యూవల్ చేసుకోవలన్నా, వాహనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న బ్రోకర్ల జేబులు తడపాల్సిందే. ఇకపై అలాంటి తడుపులు ఉండవ్. తెలంగాణ రవాణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ ద్వారానే పలు రకాల సేవలని అందించేందుకు పోర్టల్ ని తీసుకొచ్చింది.

ఈ పోర్టల్ ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ప్రస్తుతానికి ఐదు రకాల సేవలు లెర్నింగ్‌ లైసెన్సు, డ్రైవింగ్‌ లైసెన్సు, బ్యాడ్జ్, సాధారణ పత్రాల స్థానంలో స్మార్ట్‌కార్డులు ఆన్‌లైన్‌లోనే అందించనున్నారు. భవిష్యత్ లో మరో 12 సేవలని ఆన్ లైన్ లోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు.  రవాణా శాఖ అందజేసే పౌరసేవలను మరింత సులభతరం చేసేవిధంగా ఆన్‌లైన్‌ సర్వీసులకు ప్రాధాన్యతనిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.