కీర్తి.. క్రాక్ గర్ల్ అట !
హీరోయిన్ కీర్తి సురేష్ ప్రేమలో పడింది అనే ప్రచారం మొదలైంది. దీనికి కారణం కీర్తి సురేష్ షేర్ చేసిన ఓ ఫోటో. దానికి ఆమె పెట్టిన కామెంట్. శుక్రవారం త్రో బ్యాక్ పేరుతో ఓ ఫోటోని షేర్ చేసింది. ఆ ఫొటోలో కీర్తి నవ్వుతూ, కళ్లు పెద్దవిగా చేసి చూస్తూ.. ఎవరికో హాయ్ చెప్తుంది. ఈ ఫోటోకు ‘నా కళ్ళలో ఉన్న ఉత్సాహం నేను నిన్ను చూసినందుకా..! సప్నదత్, లేదా నా చివరి చెల్లింపు వచ్చినందున కావచ్చు!’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో కీర్తి సురేష్ ప్రేమలో పడిందనే కథనాలు పెట్టుకొచ్చాయ్.
తాజాగా కీర్తి సురేష్ త్రో బ్యాక్ పిక్ పై నిర్మాత సప్నదత్ (అశ్వినీదత్ కూతురు) స్పందించింది. ‘ఈ క్రాక్ గర్ల్ తన రెమ్యునరేషన్ కూడా సరిగా అడగదు’ అని కామెంట్ పెట్టింది. మహానటి సినిమాతో కీర్తి సురేష్ కీర్తి మరింతగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వైజంతి మూవీస్ పై స్వప్నదత్ నిర్మించారు. ప్రస్తుతం కీర్తి సురేష్ సర్కారు వారి పాట, రంగ్ దే చిత్రంలో నటిస్తోంది.