పవన్ లుక్ పై వర్మ సటైర్లు

యంగ్ హీరో నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. రేపు (జులై 26) నితిన్-షాలినీల వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన నితిన్ పెళ్లికొడుకు వేడుకకు పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, నిర్మాత రాథాకృష్ణ హాజరయ్యారు. నితిన్ ని ఆశీర్వదించారు. అయితే చాతుర్మాస్య దీక్షలో ఉన్న పవన్.. దానికి సంబంధించిన డ్రెస్ లోనే వచ్చేశారు. దాదాపుగా బాబా గెటప్ లో పవన్ కనిపించారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్.

ఈ ఫోటోలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. “బాబు బాబాగా మారిపోయారా ?” అని ట్వీట్ చేశారు. ఆ తర్వాత కేవలం పవన్ ఫోటో పోస్ట్ చేసిన వర్మ ”నేను మాములుగా బాబులను బాబాలను నమ్మను. కానీ ఈ బాబు బాబాను మాత్రం నేను నమ్ముతున్నాను. నాకు మీ ఆశీర్వాదం కావాలి” అని ట్వీట్ చేశాడు. ఆర్జీవీ వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక పవన్ పై వర్మ తీస్తున్న ‘పవర్ స్టార్’, వర్మపై పవన్ ఫ్యాన్స్ తీస్తున్న పరాన్నజీవి.. ఈ రెండు సినిమాలో ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చాయ్. మరీ.. ఈ రెండు చిత్రాల్లో ఏది బెస్ట్ అన్నది మరికొద్దిసేపట్లో తేలనుంది.