ఏపీలో లక్ష కరోనా కేసులు
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరువయ్యాయ్. గత 24 గంటల్లో రాష్ట్రంలో 7,627 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 96,298కి చేరింది. సోమవారంతో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటనుంది.
తాజాగా కరోనాతో 56 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,041కి చేరాయి. ఆదివారం కరోనాతో మృతి చెందినవారిలోతూర్పు గోదావరి జిల్లాలో తొమ్మిది మంది, విశాఖ జిల్లాలో ఎనిమిది, కర్నూలు జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. కృష్ణ, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున కరోనాతో మృత్యువాత పడ్డారు.
చిత్తూరు జిల్లాలో నలుగురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు, అనంతపురం, కడప జిల్లాల్లో ఇద్దరు చొప్పున, గుంటూరు జిల్లాలో ఒక్కరు మరణించారు. ఏపీలో ఇప్పటి వరకు 46,301 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 48,956 యాక్టివ్ కేసులు ఉన్నాయి.