బ్యాంకు అధికారులని బెదిరించిన ఎమ్మెల్యే దానంపై పోలీస్ కేసు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై పోలీస్ కేసు నమోదైంది. ఓ స్థల వివాదంలో ఆయన బ్యాంకు అధికారులని బెదిరించారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. బ్యాంక్ అధికారులు కూడా ఎమ్మెల్యే దానంపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

వివరాల్లోకి వెఌతే.. 2010లోకావూరు సాంబశివరావు అనే వ్యక్తి ఖైరతాబాద్ లోని ఖాళీ స్థలం మీద ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో లోన్ తీసుకున్నారు. లోన్ డిఫాల్టర్ కావడంతో దానిని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఓపెన్ ఆక్షన్ పెట్టింది. అలా ఆ ఓపెన్ ఆక్షన్ లో ఆ స్థలాన్ని వేరే వ్యక్తికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కేటాయించింది.

ఈ వ్యవహారంలో ఖైరతాబాద్ తెరాస ఎమ్మెల్యే దానం తలదూర్చారు. బ్యాంకు వాళ్లు ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా అలా ఎలా ఇస్తారంటూ బ్యాంకు అధికారులని నిలదీశాడు దానం. అంతేకాదు.. దురుసుగా మాట్లాడారు. స్థలం తిరిగి కావూరి సాంబశివరావుకే కేటాయించాలంటూ బ్యాంకు అధికారులని బెదిరించారు. దీనిపై బ్యాంక్ అధికారులు పోలీసులని ఆశ్రయించారు. ఎమ్మెల్యే దానంపై ఫిర్యాదు చేశారు.