ఆ రెండు రాష్ట్రాల సరిహద్దుల వలనే కరోనా వ్యాప్తి : ఈటెల

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. నిజామాబాద్ జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయ్. దానికి కారణం. మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దులే కారణమని మంత్రి ఈటెల అన్నారు. ఆదివారం నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ మంత్రులు ఈటల రాజేందర్‌, ప్రశాంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ ‘మహారాష్ట్ర, కర్ణాటకతో సరిహద్దులు వల్ల నిజామాబాద్‌ జిల్లాలో కరోనా వ్యాప్తి చెందుతోంది. వలస వచ్చినవారి నుంచి కరోనా వ్యాప్తిని అరికట్టడంలో జిల్లా అధికారుల పని తీరు బాగుంది’ అన్నారు. అయితే కరోనా సాకులు వెతుక్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంది. మిగితా రాష్ట్రాలు కూడా తెలంగాణతో సరిహద్దు వలన తమ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పడం లేదు కదా. ముందు రాష్ట్రంలో కరోనా టెస్టులు పెంచండి అని ప్రజలు కోరుతున్నారు.