కరోనా అనుభవాలు పంచుకున్న విశాల్ (వీడియో)

సామాన్యులే కాదు సెలబ్రిటీలు కరోనా బారినపడుతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ హీరో విశాల్, ఆయన తండ్రి కూడా కరోనా బారిపడి కోలుకున్నారు. ఏ ఆసుపత్రిలో చేరకుండా ఇంట్లో ఆయుర్వేధిక్ చికిత్స తీసుకొని కేవలం నాలుగు రోజుల్లోనే కోలుకున్నట్టు ఇంతకుముందు విశాల్ ట్విట్ చేశారు. తాజాగా కరోనా అనుభవాలని ఓ వీడియో రూపంలో పంచుకున్నారు.

“నా సినిమాలు, సామాజిక అంశాలపై నేను ఎన్నో ట్వీట్లు మీతో పంచుకున్నా. నా దృష్టిలో వాటితో పాటు ఇదీ కూడా ముఖ్యమని భావిస్తున్నా. కరోనా బారిన పడిన నా అనుభవాన్ని మీతో పంచుకోవడం ఎంతో ముఖ్యమనిపించింది. మానవత్వంతో దీన్ని షేర్‌ చేశాను” అని సుమారు 4 నిమిషాలు ఉన్న వీడియోని విశాల్‌ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. కరోనా అనుభవాలని పంచుకున్నారు. వాటిని మీరు ఓ సారి వినేసేయండి. పాటించండి కూడా.