కరోనా ఎఫెక్ట్ : తమిళనాడు రాజధాని మారబోతుందా ?

ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖ మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన బిల్లు ప్రస్తుతం గవర్నర్ వద్ద ఉంది. ఆయన ఆమోదం పడితే.. ఏపీ రాజధాని తరలింపు ప్రక్రియ మొదలైపోయిట్టే. మరోవైపు తమిళనాడులోనూ రాజధాని తరలింపు డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. రాజధానిని చెన్నై నుంచి తిరుచ్చి మార్చాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి.

తమిళనాడు రాజధానిని తిరుచ్చికి మార్చాలని మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, కరుణానిధి లు ప్రయత్నాలు చేశారు. అయితే అప్పట్లో తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో వెనకడుగు వేశారు. తాజాగా చైన్నైలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి రాజధాని మార్పు తెరపైకి వచ్చింది. సామాన్యులు, సెలబ్రిటీలు కూడా రాజధానిని చెన్నై నుంచి తిరుచ్చికి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా దీనిపై సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారమ్.

ఇక తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 2 లక్షలు దాటాయి. ఇప్పటివరకు 2,07,000 కేసులు నమోదు కాగా 1,51,000 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 3,409 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు. దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న నగారాల్లో చెన్నై ఒకటిగా నిలిచింది.