గుంటూరు ఆసుపత్రిలో పేరుకుపోయిన శవాలు
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసులు 7వేలకి పైగానే నమోదవుతున్నాయ్. ప్రతిరోజూ 50మందికి పైగా మృతి చెందుతున్నారు. కరోనా కారణంగా మృతి చెందిన వారి శవాలని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు కూడా ఆసక్తి చూపించడం లేదు. దీంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో శవాలు పేరుకుపోయాయ్.
ఆసుపత్రి మార్చురీ సామర్ధ్యం 20 మృతదేహాలు కాగా ఇప్పటికే 42 మృత దేహాలు ఉన్నట్టు సమాచారం. పేరుకుపోయిన మృతదేహాలకు సామూహిక ఖననం పై అధికారులు నేడు నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే 29 మృతదేహాలను గుంటూరు నగర పాలక సంస్థ ఖననం చేసిందని తెలుస్తోంది. చనిపోయిన వారి బంధువులకి ఫోన్లు చేసి చెబుతున్నా మృతదేహాలను తీసుకెళ్లటం లేదని ఎక్కడ భద్రపరచాలో తెలియటం లేదని అధికారులు చెబుతున్నారు.