ఆర్థిక వ్యవస్థకు మేలుకు అర్బీఐ గవర్నర్ చెప్పిన 5సూత్రాలు

భారత ఆర్థిక వ్యవస్థకు మేలు చేసేందుకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఐదు సూత్రాలు చెప్పారు. సోమవారం శక్తికాంత్ దాస్ భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయం, పునరుత్పాదకత ఇంధన శక్తి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటి), సప్లయ్‌ చైన్‌, మౌలికవసతులు వంటి ఐదు రంగాలలో భారత్ తన శక్తి సామర్ధ్యాలతో ప్రపంచంలో అగ్రగామిగా ఎదిగి తన స్థానాన్ని సుస్థిరపరచుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

గత ఐదు సంవత్సరాలలో పునురుత్పాదకత ఇంధన రంగంలో కూడా భారత్ ఎంతో వృద్ధి సాధించిందని తెలిపారు. దేశంలో పునరుత్పాదక వ్వవస్థాపన సామర్ధ్యం 2015 మార్చిలో 11.8 శాతం ఉండగా 2020 మార్చి నాటికి అది 23.4 శాతానికి పెరిగిందని శక్తికాంత్ దాస్ అన్నారు. అంతర్జాతీయంగా సప్లయ్‌ చైన్‌లో భారత్‌ తన వాటాను పెంచుకోవాల్సిన అవసరాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమెరికా, బ్రిటన్, యూరప్‌ వంటి దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను పెంచుకోవడం ద్వారా ఈ రంగంలో పురోగతి సాధించవచ్చని అన్నారు.