గోల్డ్ రేట్ ఆల్ టైమ్ రికార్డ్
పసిడి ధర పైపైకి పోతోంది. సోమవారం నాటి ఫ్యూచర్ ట్రేడింగ్‌లో బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.52,220 పలికింది. అంతర్జాతీయంగా బంగారం ధర 1శాతం పెరిగి 1,920 డాలర్లకు చేరడంతో సెప్టెంబరు 2011లో నమోదైన మార్కును దాటేసింది.
ఇక నేటి బులియన్ ట్రేడింగ్‌లో రూ.929 పెరిగిన 10 గ్రాముల పసిడి రూ.51,964కు చేరింది. వెండి కిలో రూ.3,722 పెరిగి రూ.64,945కు పలికింది. అమెరికా-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనంతో మదుపరులు బంగారాన్ని భద్రమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. దీంతో పసిడిపై పెట్టుబడులు పెరుగుతుండటంతో దాని ధర నానాటికీ పెరుగుతోంది.