భజ్జీకి కరెంట్ షాక్
లాక్‌డౌన్ వేళ హైదరాబాద్‌లో జనాలకి కరెంట్ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. సామాన్య జనాలకు సైతం దిమ్మతిరిగే కరెంట్ బిల్లులు వచ్చాయి. తాజాగా టీమ్‌ఇండియా వెటరన్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కరెంట్ షాక్ తగిలింది. భజ్జీకి ఏకంగా రూ. 33,990 కరెంట్ బిల్లు వచ్చిందట. సహజంగా తాను కట్టేదాని కన్నా ఇది ఏడింతలు ఎక్కువ వచ్చిందని భజ్జీ చెప్పాడు.
ముంబయి ఆదాని ఎలక్ట్రిసిటీ సంస్థ నుంచి ఇటీవల తనకు వచ్చిన మెసేజ్‌ను భజ్జీ ట్విటర్‌లో పోస్టు చేశాడు. అందులో చుట్టుపక్కల వాళ్లందరి బిల్లు కూడా తనకే ఇచ్చారా అంటూ ఆ సంస్థను నిలదీశాడు. గతంలో తాప్సీకి కూడా కరెంట్ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఆమెకు రూ.36 వేల కరెంట్ బిల్లు వచ్చింది. అది కూడా ఆ ఇంట్లో ఎవరు ఉండటం లేదట.