బిగ్ బాస్4.. ఓ బ్యాడ్ న్యూస్ !

బిగ్ బాస్ తెలుగు విజయవంతంగా మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. నాల్గో సీజన్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 4 విశేషాలు ఒక్కొక్కటిగా బయటికి లీక్ అవుతున్నాయ్. ఈ క్రమంలో బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ వీరే అంటూ కొన్ని పేరు బయటకు వస్తున్నాయి. ఈ లిస్టులో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు శ్రద్దాదాస్. ఆమె బిగ్ బాస్ 4లో పాల్గొనబోతుందనే ప్రచారం చాన్నాళ్లుగా జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారంపై శ్రద్దాదాస్ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.

“బిగ్‌బాస్‌ తెలుగు’లో చేయాల్సిందిగా నన్ను ఎవరూ సంప్రదించలేదు. నేను అందులో భాగం కావడం లేదు. దీనిపై చాలా మంది నుంచి నాకు సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా ధ్రువీకరించుకున్న తర్వాతే నా పేరు రాయడం మంచిది.లేకపోతే అలాంటి వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం. ఇదే మొదటి చివరి హెచ్చరిక” అంటూ రాసుకొచ్చారు.

ఇక బిగ్ బాస్ నాల్గో సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇక కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బిగ్ బాస్ యాజమాన్యం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. కంటెస్టెంట్స్ కి హెల్త్ ఇన్సురెన్సులు చేయిస్తుందని తెలుస్తోంది.