గుడ్ న్యూస్ : మోడెర్నా (కరోనా) టీకా మూడోదశ ప్రయోగాలు

కరోనా మహమ్మారికి వాక్సిన్ కనుకొనేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నీ కూడా ప్రయోగాల దశలో ఉన్నాయి. ఏ దేశం, ఏ కంపెనీ ముందుగా కరోనాకి వాక్సిన్ విడుదల చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో  మోడెర్నా సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి మూడో దశ ప్రయోగాలు ప్రారంభించింది.

మూడో దశ ప్రయోగాల్లో భాగంగా 30 వేల మంది వాలంటీర్లకు టీకాను ఇచ్చే కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించింది. మోడెర్నాతో పాటు ఫైజర్‌ కూడా ఈ ప్రయోగాలను చేపడుతోంది. వ్యాక్సిన్‌ భద్రతతో పాటు ఏస్థాయి కొవిడ్‌ను ఇది అడ్డుకొంటుందనే అంశాలను నిర్ధారించడమే ఈ మూడో దశ ప్రయోగాల లక్ష్యం. ఇవి విజయవంతమైతే 2020 చివరి నాటికి ప్రజలకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌(ఎన్‌ఐహెచ్‌) డైరెక్టర్‌ ఫ్రాన్సిస్‌ కొలిన్స్‌ తెలిపారు.