ఇచిత్రం : పాలిస్తున్న మేకపోతు
మగ ఆడ అయితే ఇచిత్రమే. ఇలాంటి ఇచిత్ర సంఘటనలు అప్పుడప్పుడు వెలుగులోనికి వస్తుంటాయ్. తాజాగా రాజస్థాన్ లోని ధోల్పూరులోని గుర్జా గ్రామంలో మేకపోతు పాలు ఇస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. రాజస్థాన్ ధోల్పూరులోని గుర్జా గ్రామానికి చెందిన రాజీవ్ కుష్వాహా.. రెండున్నర నెలల వయసున్న ఓ మేక పోతుని కొనుగోలు చేశాడు.
ఈ మేకపోతు ఆరు నెలల తర్వాత పొదుగు చేసింది. ఆ పొదుగును పితుకగా పాలు వస్తున్నాయ్. ప్రతిరోజూ హాఫ్ లీటర్ వరకు పాలిస్తుందని మేకపోతు యజామాని చెబుతున్నారు. హర్మోన్ల అసమతుల్యత కారణంగా మేక పాలు ఇస్తుందని పశు సంవర్ధక శాఖ వైద్యులు చెబుతున్నారు. ఇక పాలిస్తున్న ఈ మేకపోతుని చూడ్డానికి స్థానికులు తరలివస్తున్నారు. ఈ ఇచిత్రాన్ని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.