‘అజ్ఝాతవాసి’ కోసం యంగ్ హీరోలు వెయిటింగ్ !

సంక్రాంతి కానుకగా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘అజ్ఝాతవాసి’ కోసం ప్రేక్షకులు, ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరోల్లో పవన్ వీరాభిమానులు కూడా ఉన్నారు. ఇప్పుడు వీరు ‘అజ్ఝాతవాసి’ని ఓ రోజు ముందుగానే చూసేందుకు రెడీ అవుతున్నారు. పవన్ భక్తుడు నితిన్ ‘అజ్ఝాతవాసి’ని బెనిఫిట్ షోస్ లో చూసేయనున్నాడు.

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం అమెరికాలో “కిరాక్ పార్టీ” షూటింగ్ లో ఉన్నాడు. అక్కడ ప్రీమియర్ షోస్ లో ‘అజ్ఝాతవాసి’ని చూసేందుకు ఏర్పాట్లు చేసుకొన్నట్టు తెలుస్తోంది. మెగా యంగ్ హీరోలు సాయిధరమ్ తేజు, వరుణ్ తేజ్, వీరే కాకుండా నితిన్, శర్వానంద్, ఆది పినిశెట్టి.. తదితరులు అజ్ఝాతవాసిని ప్రిమియర్ షోస్ లోణే చూడబోతున్నారు. మరోవైపు, మెగా ఫ్యామిలీ కోసం ‘అజ్ఝాతవాసి’ స్పెషల్ షో వేయబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు, మెగా ఫ్యామిలీ అంతా ఒకే చోట సినిమా చూడబోతుందని చెప్పుకొంటున్నారు.