గుడ్ న్యూస్ : ఆగస్టు 1 నుంచే థియేటర్స్ తెరచుకోనున్నాయ్
సినీ ప్రేమికులకి గుడ్ న్యూస్. మునుపటిలా మళ్లీ థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూడొచ్చు. వచ్చే నెలలోనే థియేటర్స్ తెరచుకోనున్నాయ్. ఈ మేరకు కేంద్రం కసరత్తు చేస్తోంది. అన్ లాక్ 3.ఓ లో భాగంగా థియేటర్స్ కి అనుమతి ఇవ్వనున్నారు. 25శాతం ఆక్యూపెన్సీతో థియేటర్స్ తెరవడానికి కేంద్రం అనుమతులు ఇవ్వనుంది.
దీని గురించి కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం మరింత క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 1 నుంచి 25 శాతం ఆక్యుపెన్సీతో సినిమా హాళ్లు తెరవడానికి బాలీవుడ్ నిర్మాణ సంస్థలూ అంగీకరిస్తూ లేఖలు రాశాయి. ఈ నెల 31న తుది నిర్ణయం ప్రకటిస్తాం. రాష్ట్ర యూనిట్లు, ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్ కౌన్సిళ్ల నుంచి లేఖలు ఇవ్వండి. హోంశాఖకు కూడా లేఖలు ఇస్తే ప్రధాని దృష్టికి తీసుకెళ్తా. కేంద్ర, రాష్ట్రాలకు ఆదాయం వచ్చే సినీ పరిశ్రమపై సానుకూల నిర్ణయం ఉంటుంది” అన్నారు. అయితే 25శాతం ఆక్యూపెన్సీతో థియేటర్స్ నడవగలవా ? అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయింది.