ఏపీలో రాపిడ్ కిట్స్ కుంభకోణం.. ?
కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. కరోనా చికిత్స కోసం భారీగా ఖర్చు పెడుతోంది. కరోనా టెస్టులు చేయడంలో ఏపీనే టాప్ లో ఉంది. దీని వలన ఎక్కువ కేసులు నమోదవుతున్న ప్రభుత్వం జక్కడం లేదు. నిజాయితీగా పని చేస్తోంది. అయితే కొందరు అధికారులు మాత్రం ప్రభుత్వ ప్రయత్నాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
రాపిడ్ కిట్స్ ని అక్రమంగా అమ్ముకుంటున్నట్టు విషయం వెలుగులోనికి వచ్చింది. కొందరు సూపరెండెంట్స్ రాపిడ్ కిట్స్ ని అక్రమంగా అమ్ముకుంటున్నారు. ప్రయివేటు వ్యక్తులతో ఓ ముఠాని రెడీ చేసుకొని.. వారి ద్వారా రాపిడ్ కిట్స్ ని తీసుకెళ్లి బిగ్ షాట్స్ (ధనవంతుల) ఇంటికి వెళ్లి.. వారికి పరీక్షలు చేస్తున్నారు. ఇందుకు గానూ రూ. 3000 నుంచి 3500 తీసుకుంటున్నారు.
ఇలా ప్రతిరోజూ ఒక్కో సూపరెండెంట్ కు సంబంధించి పదుల సంఖ్యలో టెస్టులు చేసి క్యాష్ చేసుకుంటున్నట్టు సమాచారమ్. ఇలా ఏపీ అంతటా ఈ వ్యవహారం నడుస్తోంది అనే టాక్ ఉంది. మరీ.. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారిస్తే మంచిదేమో. లేదంటే.. కరోనా విషయంలో ప్రభుత్వం ఇన్నాళ్లు పడిన, పడుతున్న శ్రమ వృధా అయ్యే అవకాశాలున్నాయి.