తెలుగు సినిమాలన్నీ ఓటీటీ బాట !


మాది ఓటీటీ సినిమా కాదు. థియేటర్స్ లో చూడాల్సిన సినిమా అని టాలీవుడ్ హీరోలు, దర్శక-నిర్మాతలు కబర్లు చెప్పారు. కానీ ఇప్పుడు వారంతా ఓటీటీ వైపు చూస్తుండటం విశేషం. ఇంకో నెల దాక థియేటర్స్ తెరచుకొనేలా లేవ్. ఆ తర్వాత కూడా తెరచుకుంటాయనే గ్యారెంటీ అయితే లేదు. ఒకవేళ తెరచుకున్న 25శాతం ఆక్యుపెన్సీతో అంటున్నారు. అలా అయితే గిట్టుబాటు కాదు.

ఈ నేపథ్యంలో దాదాపు అరడజనుకు పైగా సినిమాలు ఇలా వున్నాయి. ఉప్పెన, వి, నిశ్శద్దం, రెడ్, క్రాక్, సోలో బతుకే సో బెటరు, ఒరేయ్ బుజ్జిగా సినిమాలన్నీ ఓటీటీ రిలీజ్ కోసం డిస్కషన్స్ జరుపుతున్నాయి. క్రాక్, సోలో బతుకే సో బెటరు సినిమాలు జీ 5 తో డిస్కషన్లలో వున్నాయని సమాచారమ్. కానీ ఓటిటి లు తెలుగు సినిమాల విషయంలో అంత ఫాస్ట్ గా రెస్పాండ్ కావడం లేదని తెలుస్తోంది. మీడియం రేంజ్ సినిమాలు దాదాపు రూ. 30కోట్లకి పైగా డిమాండ్ చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.