కరోనా ఎఫెక్ట్ : 33 యేళ్ల తర్వాత పదో తరగతి పాసైన హైదరాబాదీ

కరోనా మహమ్మారి.. ఓ వ్యక్తి కోరిక తీర్చింది. హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ నూరుద్దీన్ ని పదో తరగతి పాస్ చేయించింది. 1987లో మహమ్మద్ నూరుద్దీన్ తొలిసారి పదో తరగతి పరీక్ష రాశాడు. తొలి ప్రయత్నంలో పాస్ కాలేదు. ఆ తర్వాత చాలా సార్లు పదో తరగతి పరీక్షలు రాశాడు. తప్పాడు. అయితే, ఆయన ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. ఈ 33యేళ్లలో పలు మార్లు పదో తరగతి పరీక్షలు రాస్తూనే వస్తున్నాడు. తప్పుతూనే ఉన్నాడు. అయితే ఫైనల్ గా ఆయన్ని కరోనా పాస్ చేసింది.

కరోనా ఎఫెక్ట్ తో ఈ యేడాది తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలని రద్దు చేసిన సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షల కోసం ఫీజులు కట్టి.. హాల్ టికెట్ పొందిన ప్రతిఒక్కరిని పాస్ చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ కి చెందిన మహమ్మద్ నూరీద్దిన్ కూడా పాసైపోయాడు. 35శాతం మార్కులతో ఆయన్ని పాస్ చేశారు. అయితే ఈ సారి మహమ్మది నూరీద్దిన్ రెగ్యూలర్ పదో తరగతి పరీక్షలు రాయలేదు. ఓపెన్ స్కూల్ లో పదో తరగతి పరీక్షలు రాశారు. మొత్తం ఆరు సబ్జెక్టులకి పరీక్షలు రాసేందుకు రూ. 3వేల ఫీజు కట్టాడు.

33 యేళ్ల తర్వాత పదో తరగతి పాస్ కావడంపై మహమ్మద్ నూరీద్దిన్ ఆనందం వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో ఎంతకి పాస్ కాలేకపోయా. ఎప్పుడు 32, 33 మార్కులే వచ్చేవి. అయితే ఈ సారి మరోసారి పరీక్షలు రాద్దామని భావించా. అయితే అప్పటికే ఫీజు కట్టే డేటు అయిపోవడంతో.. ఓపెన్ స్కూల్ లో కట్టా. అన్నీ సబ్జెక్టులకి పరీక్షలకి రాయడానికి రెడీ అయ్యా. అయితే కరోనా కారణంగా పరీక్షలు రద్దయి.. అందరిని పాస్ చేయడంతో నేను పాసయ్యా. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ థ్యాంక్స్ చెబుతున్నా అన్నారు మహమ్మాద్ నూర్. అయితే ఇక్కడ రియల్ హీరో మాత్రం మహమ్మాద్ నూరుద్దీన్ నే అని చెప్పాలి. 33 యేళ్ల తర్వాత కూడా పట్టువదలని విక్రమార్కుడిగా పదో తరగతి పరీక్షలు రాసిన మహమ్మద్ నూరుద్దీన్ ని అభినందించాల్సిందే.

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Nooruddin. 51 years old, trying to clear his SSC since 1987, failing every year in English. This year, he was due to appear again when the Telengana government passed all students in the SSC after the exams were cancelled. <br>Perseverance pays! <a href=”https://t.co/ZasFs2ONMR”>https://t.co/ZasFs2ONMR</a></p>&mdash; Joy Bhattacharjya (@joybhattacharj) <a href=”https://twitter.com/joybhattacharj/status/1288685061315780609?ref_src=twsrc%5Etfw”>July 30, 2020</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>