మెట్రో నష్టం రూ. 200కోట్లకుపైనే !
మెట్రోరైలు ప్రయాణికులకు దూరమై నాలుగున్నర నెలలు గడుస్తోంది. మార్చి 22న దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధించడంతో మెట్రోసేవలు నిలిచిపోయాయి. ఆ మరుసటి రోజు నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. రెండునెలలుగా ఆంక్షలు సడలిస్తూ వస్తున్నా మెట్రోరైళ్లకు మాత్రం అనుమతి దక్కలేదు.
తాజా మార్గదర్శకాల్లోనూ కేంద్రం అనుమతి ఇవ్వలేదు. హైదరాబాద్‌తో సహా మెట్రో నగరాల్లో కొవిడ్ కేసులు తగ్గకపోవడంతో మరికొంతకాలం అనుమతి ఇవ్వకపోవడమే సురక్షితమనే భావనలో కేంద్రం ఉంది. ఈ నాలుగున్నర నెలల్లో మెట్రో రూ.200 కోట్లపైనే ఆదాయాన్ని కోల్పోయింది.