ఏపీ ఎస్ఈసీగా మళ్లీ నిమ్మగడ్ద నియామకం

ఏపీ ప్రభుత్వంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజయం సాధించారు. ఆయన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమిస్తూ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరుతో ప్రకటన జారీ చేశారు. ఈ మేరకు రాజపత్రం (గెజిట్‌) విడుదల చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు.

సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడి పదవీ పునరుద్ధరణ నోటిఫికేషన్‌ ఉంటుందని పేర్కొన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థ ఎన్నికలని వాయిదా వేస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్ద రమేష్ కుమార్ మార్చి 15న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దానికి సీఎం జగన్ మండిపడ్డారు.

అంతేకాదు.. రాష్ట్ర ఎన్నికల కమీషన్ పదవి కాలాన్ని కుదిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దీనిపై నిమ్మగడ్డ హైకోర్టుని ఆదేశించారు. హైకోర్టు నిమ్మగడ్డని ఎస్ ఈసీగా తిరిగి నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించించి. ప్రభుత్వం దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఫైనల్ గా నిమ్మగడ్డని తిరిగి ఎస్ ఈఎస్ గా నియమించడం ఏపీ ప్రభుత్వానికి తప్పలేదు.