సొంతంగా డబ్బును ముద్రించుకుంటున్న సామ్ !
వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇదీ నిజం. కరోనా లాక్‌డౌన్ కాలాన్నిసమంత బాగా వినియోగించుకుంటున్నారు. వంటలు నేర్చుకున్నారు. ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టారు. తెలుగు స్పష్టంగా నేర్చుకున్నారు. ఇందుకోసం ఆన్ లైన్ క్లాసులు విన్నారు. వ్యవసాయం కూడా చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలని అభిమానులతో పంచుకున్నారు సామ్. అయితే తాజాగా తాను ఎందుకు వ్యవసాయం చేయాలనుకున్నానో చెబుతూ సామ్ ఓ వీడియో పోస్ట్ చేశారు. దీనికి ‘మీ ఆహారాన్ని మీరే పండించుకోవడం అంటే, మీరే సొంతంగా డబ్బును ముద్రించుకోవడం లాంటిది’ – అని రాన్‌ఫిన్లే వ్యాఖ్యను జత చేశారు.
“లాక్‌డౌన్ ప్రకటించగానే అందరిలాగే నేనూ ఆశ్చర్యపోయా. సరకుల కోసం నేను, చైతన్య సూపర్‌మార్కెట్‌కు పరిగెత్తాం. మీలో చాలా మంది ఇదే చేసి ఉంటారు. తెచ్చుకున్న సరకులన్నీ ఎన్ని రోజులు వస్తాయో లెక్కపెట్టాం. అవన్నీఅయిపోతే చేయాలో తెలియని పరిస్థితి. ఆ సమయంలో అందరం భయపడ్డాం. పైగా మీకు, మీ ఆప్తులకు ఆరోగ్యకరమైన ఆహారం కష్టమే. ఆ పరిస్థితితో నేను గందరగోళానికి గురయ్యా. మనకు పోషకాలతో కూడిన ఆహారం లేదు. ఈ విపత్కర పరిస్థితి నాకు ఒక పాఠాన్ని నేర్పింది. అందుకే అవసరమైన ఆహారాన్ని పండించుకోవాలని నిర్ణయించుకున్నా. ఈ విషయాన్ని మీతో కూడా పంచుకున్నా” అని చెప్పుకొచ్చింది.