సుజనాకి క్లాస్ పడింది
భాజాపా ఎంపీ సుజనా చౌదరికి సొంత పార్టీ ఝులక్ ఇచ్చింది. ఆయన పార్టీ వైఖరికి భిన్నంగా మాట్లాడారని ఏపీ భాజాపా ట్వీట్ చేసింది. సుజనా బీజేపీ ఎంపీనే అయినా తెదేపా నేతల వ్యహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అదీ నిజమే. ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఏపీ భాజాపా స్టాండ్ ఒకటైతే.. సుజనా వ్యాఖ్యలు మరోలా ఉంటున్నాయి.రాజధాని అంశం కేంద్రం పరిధిలోని అంశం. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా కేంద్రం రాజధాని విషయంలో జోక్యం చేసుకుంటుందని సుజనా మొదటి నుంచి చెబుతున్నారు. నిన్న కూడా ఇవే మాటలు అన్నారు.
తాజాగా ఆయన మాటలని ఏపీ భాజాపా ఖండించింది. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ పార్టీ తెలిపింది. అయితే, రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశం మాత్రం కేంద్రం పరిధిలో లేదని తెలిపింది. రాజధాని కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందన్న సుజనాచౌదరి వ్యాఖ్యలను ఏపీ భాజపా ఖండించింది. పార్టీ వైఖరికి భిన్నంగా సుజనా చౌదరి మాట్లాడారని ట్వీట్ చేసింది.
రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది అన్న బిజెపి ఎంపి శ్రీ @yschowdary గారి వ్యాఖ్య పార్టీ విధానానికి విరుద్ధం.
రాజధాని అమరావతిలోనే కొనసాగాలి కానీ ఈ విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదన్నదే బిజెపి విధానంగా అధ్యక్షులు శ్రీ @somuveerraju గారు స్పష్టం చేశారు. pic.twitter.com/4v2IF6Dare
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) July 31, 2020