‘ఐకాన్’ అటకెక్కినట్టేనా ?

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ 20వ చిత్రంగా ‘పుష్ప’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ చిత్రమిది. రష్మిక మందన కథానాయిక. కరోనా ప్రభావం లేకుంటే.. ఇప్పటికే ‘పుష్ప’ సెట్స్ మీదకు వెళ్లేదే. అయితే ‘పుష్ప’ తర్వాత బన్నీ ‘ఐకాన్’ సినిమా చేయాల్సి వుంది.

ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చేసింది. బన్నీ బర్త్ డే కానుకగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాల్సి ఉంది. దిల్ రాజు నిర్మాత.  ‘ఐకాన్’ టైటిల్ ‘కనబడుట లేదు’ అనేది ట్యాగ్ లైన్. నిజంగా ఐకాన్ కనబడకుండా పోయింది. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ సినిమా అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. ఇది అల్లు అర్జున్ 21వ సినిమా అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐకాన్ అటెక్కికిందని అర్థమైపోతోంది. దానికి గల కారణాలు ఏంటీ ? అనేది తెలియాల్సి ఉన్నాయి.