తిలక్ కు ప్రధాని నివాళి
లోకమాన్య’ బాల గంగాధర్ తిలక్ శతవర్ధంతి నేడు. జులై 23, 1856లో జన్మించారు. ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని నినదించిన బాల గంగాధర్ తిలక్‌ను భారత స్వాతంత్రోద్యమానికి ఆద్యుడిగా భావిస్తారు. పండితుడు, రచయిత, గణితవేత్త, తత్వవేత్త ఆయిన బాల గంగాధర్ తిలక్, ఆగస్టు 1, 1920న ముంబయిలో కన్నుమూశారు. తిలక్ శతవర్థంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నివాళీ అర్పిచారు.
‘లోకమాన్య తిలక్ 100వ పుణ్యతిథి సందర్భంగా భారత్ ఆయనకు ప్రణమిల్లుతోంది. ఆయన మేధస్సు, ధైర్యం, న్యాయవర్తన, స్వరాజ్య భావన నిరంతరం స్ఫూర్తినిస్తాయి’ అంటూ ప్రధాని మోడీ ట్విట్ చేశారు. అంతేకాదు తిలక్ జీవితంలోని కొన్ని ముఖ్య అంశాలకు సంబంధించిన ఓ వీడియోను పంచుకున్నారు.