62 గెటప్స్’లో బాలయ్య

విశ్వ విఖ్యాత నట స్వారభౌమ ‘నందమూరి తారక రామారావు’ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తనయుడు నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో ఈ సినిమా తెరకెక్కనుంది. నిర్మాత కూడా ఆయనే. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఎన్టీఆర్ భార్య బసవ తారక పాత్ర కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు దర్శకుడు తేజ. చాలామందే ఆడిషన్స్ కి హాజరవుతున్నారు. వీరిలోంచి ఒకరిని ఎంపిక చేయనున్నారు. ఐతే, ఈ ఎంపికలో దర్శకుడు తేజ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని వాడుతున్నారు. ఇక, ఈ సినిమాలో బాల ఎన్టీఆర్’గా క‌ళ్యాణ్ రామ్ త‌న‌యుడు శౌర్య రామ్ ను ఎంపిక చేశాడు ద‌ర్శ‌కుడు తేజ‌.

ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్‌ జీవితంలో తెలియని కోణాల్నీ చూపిస్తున్నాం. దాదాపుగా 62 గెటప్పుల్లో కనిపించబోతున్నానని బాలయ్య చెబుతున్నాడు. నాన్నగారు అందరినీ ‘నా’ అనుకునేవారు. అజాత శత్రువని ఆయన నమ్మకం. కానీ.. ప్రతీ ఒక్కరి జీవితంలో ఆత్మీయులు, బంధువులు, స్నేహితులతో పాటు శత్రువులూ ఉంటారు. అలాంటి ఆసక్తికరమైన విషయాల్ని బయోపిక్‌లో పొందుపరిచాం. పుట్టినప్పటి నుంచీ చివరి వరకూ చరిత్ర మొత్తం చూపించబోతున్నామని బాలయ్య తీపి కబరు చెప్పాడు.