అల.. 300మిలియన్ వ్యూస్.. ఆల్ టైమ్ రికార్డ్ !

అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. ఈ యేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన అల.. బ్లాక్ బస్టర్  హిట్ అయింది. ఇక ఈ సినిమాలోని పాటల రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా బుట్టబొమ్మ సాంగ్ 300మిలియన్ వ్యూస్ సొంతం చేసుకొంది.

ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. పాటలు, నేపథ్య సంగీతంతో అద్భుతం చేశారు. ఎంతలా అంటే.. ? మరోసారి ఈ అద్భుతం రిపీట్ అవుతుందో ? లేదో.. ?? అన్నంతగా. అమృతం పూసిన బాణీలతో ఆకట్టుకున్నాడు. దానిని ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఆస్వాదిస్తూనే ఉంటారు.