జూనియర్ హార్దిక్ పాండ్యాని చూశారా ?


టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య తండ్రైన సంగతి తెలిసిందే. రెండ్రోజు క్రితం హార్దిక్ పాండ్యా సతీమణి నటాషా మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఆ చిన్నారి ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు హార్దిక్. ఎంతో సంతోషంగా తన కుమారుడిని ఎత్తుకున్న ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు హార్థిక్. దీంతో.. జూనియర్‌ పాండ్య క్యూట్‌గా ఉన్నాడని, కంగ్రాట్స్‌ అంటూ నెటిజన్స్ విష్ చేస్తున్నారు.

ఈ ఏడాది తొలి రోజున సెర్బియన్‌ నటి నటాషా స్టాంకోవిచ్‌కు దుబాయ్‌ సముద్ర జలాల్లో వినూత్నంగా ప్రపోజ్‌ చేశాడు. ఆమె కూడా పాండ్య ప్రేమను అంగీకరించింది. మేలో నటాషా గర్భవతిగా ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే జులై 30న ఆమె చిన్నారికి జన్మనిచ్చింది.