బిగ్ బాస్ 4.. షూటింగ్ మొదలైందోచ్ !


బిగ్ బాస్ తెలుగు విజయవంతంగా మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. అతి త్వరలోనే నాల్గో సీజన్ ప్రసారం కాబోతుంది. నాల్గో సీజన్ కి కూడా కింగ్ నాగార్జుననే హోస్ఘ్ గా వ్యవహరించబోతున్నారు. తాజాగా సీజన్ 4 షూటింగ్ కూడా మొదలైపోయింది. హైదరాబాద్ అక్కినేని నాగార్జున మీద ప్రచార చిత్రాలని చిత్రీకరిస్తున్నారు.

కరోనా తర్వాత తిరిగి షూటింగ్ లో పాల్గొనడంపై నాగ్ ట్విట్ చేశారు. ‘తిరిగి షూటింగ్‌కు వచ్చేశా. లైట్స్‌.. కెమెరా.. యాక్షన్‌.. ఏం అద్భుతం… నిజంగా అద్భుతమే’ అని ట్వీట్‌ చేశారు. పీపీఈ కిట్లు ధరించి ఉన్న మేకప్‌ మెన్‌లు ఆయనను ప్రచార చిత్రాల షూటింగ్‌ కోసం సిద్ధం చేశారు. ఇక బిగ్ బాస్ 4 ప్రచార చిత్రాలకి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు.  ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ చిత్రీకరించారు. త్వరలోనే ఈ యాడ్‌ను విడుదల చేయబోతున్నారు.