అమర్‌సింగ్ ఇక లేరు
రాజ్యసభ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్‌సింగ్ (64) కన్నుమూశారు. గతంలో మూత్రపిండాల మార్పిడి చేయించుకున్న అమర్‌సింగ్.. గత ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడున్నారు. ఈ క్రమంలో సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
జాతీయ రాజకీయాల్లో అమర్ సింగ్ కీలక పాత్ర వహించారు. 2008లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి అణు ఒప్పందం విషయంలో వామపక్షాలు తమ మద్దతు ఉపసంహరించుకున్న సందర్భంలో సమాజ్‌వాదీ పార్టీ మద్దతు ఇచ్చే విషయంలో అమర్‌సింగ్ కీలకంగా వ్యవహరించారు. అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో 2010లో అమర్‌సింగ్, సినీనటి జయప్రదను సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.