దేశంలో 19 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య 50వేలకు పైగానే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 52,509 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,08,255కు చేరింది. నిన్న ఒక్కరోజే 857 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మృతులు 39,795కు పెరిగాయి.

కరోనా బారినపడినవారిలో 12,82,216 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 5,86,244 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. ఇక రోజువారీ పాజిటివ్ కేసుల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో గత 24 గంటల్లో 56,411 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 54 వేలకు పైగా పాజిటివ్ కేసులతో అమెరికా రెండో స్థానంలో ఉన్నది. రోజువారి మృతుల్లో కూడా భారత్ మూడో స్థానంలో కొనసాగుతున్నది. అమెరికా, బ్రెజిల్ దేశాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.