రామాలయ ఉద్యమం.. కంటతడి పెట్టుకున్న సీఎం !

దశాబ్ధాల భారతీయులు కోరిక మరికొద్దిసేపట్లో తీరనుంది. 500 యేళ్ల పోరాటానికి ఫలితం దక్కనుంది. మరికొద్దిసేపట్లో అయోధ్య రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి అయోధ్యకు బయలు దేరారు. 

మరోవైపు మధ్య ప్రదేష్ కేబినేట్ సమావేశంలో అయోధ్యలోని రామమందిరం, భూమి పూజ గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా రామాలయ ఉద్యమంనాటి జ్ఞాపకాలను వారంతా నెమరువేసుకున్నారు. ఈ సమయంలో సీఎం శివరాజ్‌సింగ్ ఉద్వేగానికి లోనయ్యారు. 1990లో పార్టీ నాయకుడు ఎల్‌కె అద్వానీ రథయాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను అందరితో పంచుకున్నారు.

రామ భక్తుల 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాలు, త్యాగ ఫలితంగా ఈ సంకల్పం నెరవేరిందన్నారు. 1990లో ఎల్ కె అద్వానీ నాయకత్వంలో రథయాత్ర జరిగినప్పుడు తాను ఎమ్మెల్యేనని, కరసేవ కోసం అయోధ్యకు తరలివెళ్లామన్నారు. ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో తమను అరెస్టు చేసి, జౌన్‌పూర్ జైలులో ఉంచారన్నారు. రాజనాథ్ సింగ్ కూడా అదే జైలులో ఉన్నారన్నారు. రామభక్తుల కారణంగా జైలు వాతావరణం భక్తితో నిండిపోయిందని చెబుతూ భాగోద్వేగానికి గురయ్యాడు.