మహేష్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి సన్నిహితులు, సేహితులు, సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. మహేశ్ కూడా అభిమానుల కోసం గిఫ్ట్ తీసుకొచ్చారు. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా నుంచి 44 సెకన్లపాటు ఉన్న మోషన్‌ పోస్టర్‌లో తమన్‌ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంటోంది. చిత్ర టైటిల్‌తోపాటు మోషన్‌ పోస్టర్‌ను చూస్తుంటే సినిమా డబ్బు చుట్టూ తిరుగనుందని తెలుస్తోంది. బలమైన ఎమోషన్స్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సర్కారు వారి పాట ఉండనుందని గతంలోనే మహేష్ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ కి జంటగా కీర్తి సురేష్ నటించనున్నారు.